కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ సాయికిరణ్ (ASP Sai Kiran) మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతరం, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ సాయికిరణ్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. వారి త్యాగాల ఫలితాన్ని నేడు భారతీయులందరూ స్వేచ్ఛగా, ఆనందంగా అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో దేశ సేవకు, ప్రజా సేవకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ, రూరల్ సీఐలు సమ్మయ్య, కృష్ణ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

