Mobile Popup Ad
Mobile Popup Ad

వైకల్యాన్ని జయించిన ఆత్మవిశ్వాసం.. అందరికీ ఆదర్శం తుర్కయాంజల్ సునీల్!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad), తుర్కయాంజల్ కమ్మగూడకు చెందిన దివ్యాంగుడు సునీల్ పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎవరిపైనా ఆధారపడకుండా, స్వశక్తితో ఎదగాలనే సంకల్పంతో ఏడాది కాలంగా బతుకుపోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో మూడు చక్రాల సైకిల్‌పై కూరగాయలను విక్రయిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. శారీరక వైకల్యాన్ని సైతం లెక్కచేయడం లేదు. నిరంతరం శ్రమిస్తూ జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏ చిన్న పనికైనా సాకులు వెతికే నేటి యువతకు కష్టపడే తత్వం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. స్థానిక ప్రజల మనసులను గెలుచుకోవడమే కాకుండా ఎందరికో కొండంత స్ఫూర్తినిస్తున్నాడు. ప్రస్తుతం ఇతడి వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>