epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారు : ఉత్తమ్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కేసీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswarm Project) కట్టారని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్​ రావుపై విమర్శలు గుప్పించారు. హరీష్​ రావు తన పేరును గోబెల్స్​ అని మార్చుకోవాలన్నారు. బీఆర్​ఎస్​ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్​ రావు అతి తెలివితేటలు వాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులను కాంగ్రెస్​ కట్టిందని ఉత్తమ్​ గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారా ఐదేళ్లలో కేవలం 70 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉపయోగించారని చెప్పారు. కృష్ణా(Krishna River) జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు అపెక్స్​ కౌన్సిల్​ భేటీలో కేసీఆర్(KCR)​ సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. పాలమూరు, డిండి, ఎస్​ఎల్​బీసీ(SLBC) ప్రాజెక్టులను కేసీఆర్​ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రజలను కేసీఆర్​ మోసం చేశాడని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) దుయ్యబట్టారు.

Read Also: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సవాల్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>