కలం డెస్క్: జనవరి 13 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న కైట్ ఫెస్టివల్ (Kite Festival)పై సీఎస్ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు పరేడ్ గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ కైట్ ఫెస్టివల్ లో హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. జనవరి 13 నుంచి 15 వరకు కైట్, స్వీట్స్ ఫెస్టివల్ జరుగుతాయి.
ప్రతిఏటా ఈ ఫెస్టివల్ (Kite Festival) లో దేశ విదేశాల విచ్చేసిన ప్రత్యేక పర్యాటకులు వివిధ రకాల పతంగులను అకాశంలో ఎగురవేస్తారు. కాగా ఈ ఏడాది స్పషల్‌గా డ్రోన్ షో, అలాగే హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. జనవరి 13 నుంచి 15 వరకు కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ జరగనుంది. 13, 14 తేదీల్లో డ్రోన్ షో కూడా జరగనుంది. అలాగే 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో జరగనుంది. కైట్ ఫెస్టివల్ కు ప్రవేశం ఉచితం కావడంతో నగర ప్రజలు భారీగా హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు.
Read Also: వైజాగ్‌లో అతిపెద్ద ట్రైబల్ ఈవెంట్.. విశేషాలివే!
Follow Us On: X(Twitter)


