కలం, వెబ్ డెస్క్ : 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia)పై ఓటమి తర్వాత తాను క్రికెట్ మానేయాలని ఆలోచించానని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్ ఓటమి తనను తీవ్రంగా కుంగదీసిందని, ఆ సమయంలో క్రికెట్ మానేయాలని అనిపించిందని చెప్పారు. గుర్గావ్లోని మాస్టర్స్ యూనియన్ ఈవెంట్లో ఆదివారం మాట్లాడుతూ రోహిత్ ఈ విషయాలు పంచుకున్నారు.
2022లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరల్డ్‌కప్ గెలవడమే తన లక్ష్యమని రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపారు. ‘నేను వరల్డ్ కప్ కోసం చాలా కష్టపడ్డాను. అది 2023 వన్డే వరల్డ్‌కప్ అయినా, T20 వరల్డ్‌కప్ అయినా కప్ గెలవడమే నా టార్గెట్. అది జరగకపోవడంతో నేను పూర్తిగా కుంగిపోయాను. ఒక దశలో ఈ స్పోర్ట్‌ను ఇక మానేద్దాం అనుకున్నాను’ అని రోహిత్ చెప్పారు.
ఆ ఓటమి తర్వాత కొన్ని నెలల పాటు కోలుకోవడానికి సమయం పట్టిందని, స్వీయ పరిశీలన చేసుకుని క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను గుర్తుచేసుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని వివరించారు. టోర్నమెంట్ తర్వాత బ్రేక్ తీసుకుని, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో వైట్-బాల్ సిరీస్‌లకు దూరమయ్యానని చెప్పారు. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి ఆ బ్రేక్ సహాయపడిందని తెలిపారు.
Read Also: తుది మెట్టుపై యువ భారత్ బోల్తా: అండర్–19 విజేత పాక్
Follow Us On: X(Twitter)


