Mobile Popup Ad
Mobile Popup Ad

జేఈఈ టాప‌ర్‌కు కేటీఆర్ స‌న్మానం.. వీడియోపై విమ‌ర్శ‌లు!

కలం, వెబ్ డెస్క్ : జేఈఈ మెయిన్ – 2026 ( సెషన్ 1) ఫలితాల్లో 100 పర్సంటైల్ తో సత్తా చాటిన తెలంగాణ టాపర్ వివన్ మహిశ్వరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR )నేడు కలిశారు. ఈ సందర్భంగా వివ‌న్‌ను కేటీఆర్ స‌న్మానించారు. వివన్ జేఈఈ మెయిన్ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించడంతో పాటు, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఆల్ ఇండియా 61వ ర్యాంకు (AIR 61) సొంతం చేసుకున్నాడని కొనియాడారు. అయితే ఈ సన్మానంకు సంబంధించిన వీడియో తీవ్ర విమర్శలకు దారితీస్తూ చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియోలో వివన్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. సన్మానం సందర్భంగా వివన్ (Vivan) కేటీఆర్ భుజాలపై పదే పదే చేతులు వేయగా.. దానికి కేటీఆర్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లుగా కనిపించింది. దీంతో వివన్ ప్రవర్తనపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత చదువుంటే ఏం లాభం.. సంస్కారం ఉండాలి కదా? అంటూ కొందరు విమర్శిస్తున్నారు. పెద్దలంటే గౌరవమే లేన్నట్టు ఉంది అంటూ మండిపడుతున్నారు. జెన్ జీ యాటిట్యూడ్ ఈ వీడియోతో తెలుస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోను కేటీఆర్ (KTR) ఎలా బయటకు రిలీజ్ చేయించుకున్నారని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>