Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్‌ జిల్లాలో రవాణా శాఖ కొరడా.. 11 ప్రైవేట్ బస్సులు, 2 లారీలు సీజ్!

నిర్మల్, కలం బ్యూరో: నిర్మల్ (Nirmal) జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ వాహనాలపై రవాణాశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనాలపై కొరఢా ఝులిపించారు. ఈ సందర్భంగా ఎంవీఐలు దూప్ సింగ్, తిరుపతిలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీల పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, ట్యాక్స్ చెల్లింపులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.

తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 11 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, 2 లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల భద్రతే ముఖ్యమని, ప్రతి వాహనం ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఏఎంవీఐలు (Transport Officials) రజినీకాంత్, ఆసిఫ్, అక్షయ్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: భార‌త్‌ను చూసి అమెరికా నేర్చుకోవాలి.. ఫారిన్ యువ‌తి ప్ర‌శంస‌లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>