కలం, వెబ్‌డెస్క్: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్(గ్రామీణ్) – వీబీ జి రామ్ జి (G Ram G Bill) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ మేరకు బిల్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆమోదించారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, కొత్త పేరుపై ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల, బయట ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌పై, గాంధీ కుటుంబంపై కక్ష్యతోనే గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును కేంద్రం తొలగిస్తోందంటూ దేశవ్యాప్తంగా విపక్షాలు తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేశాయి.
అయితే, ఈ ఆందోళనల మధ్య రెండు సభల్లోనూ బిల్లు(G Ram G Bill)ను పాస్ చేయించుకన్న కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందడంతో ఇకపై ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరు వీబీ జి రామ్ జి కానుంది. కొత్త చట్టం ప్రకారం పని దినాలు ఒక్కో వ్యక్తికి 125రోజులకు ప్రభుత్వం పెంచింది.
Read Also: ఓటుబ్యాంకు కోసం బంగ్లా వలసల్ని వాడుకున్న కాంగ్రెస్: ప్రధాని మోదీ
Follow Us On: X(Twitter)


