కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలుపెడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పేర్కొన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ వెనక్కి పంపించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని KCR ప్రకటించారు. ఊరూరా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. అవసరమైతే బహిరంగసభలు కూడా నిర్వహిస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు మాట విని ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపిందని ఆరోపించారు. దీనిపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నది జలాల అంశం కోసం ప్రభుత్వం అఖిల పక్షం ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
Read Also: తెలంగాణకు శనిలా బీజేపీ
Follow Us On: X(Twitter)


