epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రెండేళ్లు ఆగాము.. ఇక ఆగేది లేదు.. నేను కూడా హాజరవుతా -KCR

కలం, వెబ్ డెస్క్: అభివృద్ధి పథంలో కొనసాగిన తెలంగాణలో ఇప్పుడు క్రైం రేటు పెరిగిపోయిందని కేసీఆర్(KCR) ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో న నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నగరంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. పట్టపగలు హత్యలు జరుగుతుంటే అడిగేవారే లేరని మండిపడ్డారు. ఎంత సేపూ రియల్​ ఎస్టేట్​ ధ్యాస తప్పా వేరే ధ్యాసే లేదని కేసీఆర్​ అన్నారు. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని, అన్యాయాలపై ప్రశ్నిస్తామని కేసీఆర్​ తెలిపారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు.

యూరియా, ఎరువులను సకాలంలో అందజేస్త లేరని కేసీఆర్​ పేర్కొన్నారు. దీనికోసం ఒక యాప్​ ఏర్పాటు చేస్తున్నారని.. అది ఒక దిక్కుమాలిన యాప్ అని పేర్కొన్నారు​. రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, పింఛన్లు ఎగ్గొట్టారని, భయంకరమైన పరిస్థితిని రాష్ట్రంలో తీసుకువచ్చారని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తం, కొత్త ఉద్యోగాలు ఇస్తం, జాబ్​ క్యాలెండర్​ ఇస్తం అని.. చెప్పడంతో ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. కానీ ఆ హామీలు నెరవేర్చట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “బహిరంగ సభలు నిర్వహిస్తాం. నేను కూడా హాజరవుతా. ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. ఇప్పటికే రెండేళ్లు ఆగామని.. ఇక ఆగేది లేదని” కేసీఆర్(KCR) పేర్కొన్నారు.

Read Also: జర్నలిస్టు రాహుల్‌కి సారీ చెప్పిన కేసీఆర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>