కలం వెబ్ డెస్క్ : బీఆర్ఎస్( అధినేత కేసీఆర్(KCR) నేడు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ముందు కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao)లతో నందినగర్‌లోని నివాసంలో భేటీ అయ్యారు. సమావేశంలో మాట్లాడాల్సిన అంశాలపై కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ చర్చించారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేయడంతో పాటు సాగునీటి వాటాలపై పోరాటం కోసం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Read Also: తండ్రి, భార్యలే నిందితులు.. అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు!
Follow Us On: X(Twitter)


