కలం వెబ్ డెస్క్ : మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి (Gade Innareddy)ని ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్ట్ (Arrest) చేశారు. గత కొద్ది రోజులుగా ఇన్నారెడ్డి మీడియాలో మావోయిస్టు (Maoist)లకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. వికల్ప్ ఎన్‌కౌంటర్ సందర్భంగా ప్రధాని మోడీ (Modi), హోం మంత్రి అమిత్ షా (Amit shah)లకు వ్యతిరేకంగా ఇన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన హిడ్మా (Hidma) సొంత ఊరు పువర్తికి ఇన్నారెడ్డి మీడియాతో వెళ్లారు.
ఈ నేపథ్యంలో వరంగల్ జాఫర్గఢ్‌లోని తన నివాసంలో అనాథ శరణాలయం నడుపుతున్న ఇన్నారెడ్డిపై ఆదివారం ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ముందుగా సోదాలకు వచ్చిన అధికారులను ఆశ్రమంలోని చిన్నారులు అడ్డుకున్నారు. అనంతరం అధికారులు ఇన్నారెడ్డిని అదుపులోకి తీసుకొని జాఫర్గఢ్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు యూఏపీఏ చట్టం(UAPA ACT) కింద కేసులు నమోదు చేశారు. ఇన్నారెడ్డి (Gade Innareddy ) యూట్యూట్ చానెల్‌పైనా కేసు నమోదు చేశారు.
Read Also: బిగ్ బాస్ ట్విస్ట్.. విజేతలు తారుమారు కావచ్చు!
Follow Us On: Instagram


