కలం వెబ్ డెస్క్ : ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన నేత వైఎస్ జగన్(YS Jagan) అని, కచ్చితంగా మళ్లీ భారీ సీట్లతో అధికారంలోకి వస్తామని వైసీపీ(YCP) కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్యకర్తలు, నాయకులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా సజ్జల(Sajjala Ramakrishna Reddy) మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష తెలిపిన నేత జగన్ అన్నారు. ప్రతి కుటుంబం తనదిగా భావించి వారి మేలు ఆశించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు కోసమే జగన్ పోరాటాలు చేస్తున్నారు అని సజ్జల అన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాలేకపోయినా.. మళ్లీ కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టే..ఆయనకు మంచి ఆదరణ ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Read Also: కిలాడీ లేడీలు.. మాయ చేసి 2 కిలోల వెండితో జంప్
Follow Us On: Sharechat


