కలం డెస్క్: అండర్ 19 ఆసియా కప్ (U19 Asia Cup) ఫైనల్‌కు అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది. ఇందులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఢీ కొట్టనున్నాయి. మరి కాసేపట్లో అంటే ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ మ్యాచ్ షురూ కానుంది. ఈ ఫైనల్స్‌లో కూడా గెలిచి రికార్డ్ స్థాయిలో 12వ సారి ట్రోఫీని అందుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి తీరాలని ఆయుష్ మాత్రే నేతృత్వంలోని టీమిండియా కసిగా ఉంది.
ఈ టోర్నీలో ఓటమంటే తెలియని జట్టుగా భారత్ దూసుకుపోతోంది.
ఈ ఫైనల్స్‌లో (U19 Asia Cup Final) అందరి కళ్లు ఇద్దరే ఇద్దరు ప్లేయర్లపై ఉన్నాయి. వాళ్లే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), అభిజ్ఞాన్ కుందు (Abhigyan Abhishek Kundu). ఇద్దరూ కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేయగలరు. యూఏఈపై మ్యాచ్‌లో వైభవ్ 95 బంతుల్లోనే 171 పరుగులు చేశాడు. మరోవైపు అభిజ్ఞాన్ కూడా మలేషియాపై 125 బంతుల్లో 209 పరుగులు చేసి రికార్డ్ సాధించాడు. వీరితో పాటు భారత్ మిడిల్ ఆర్డర్లో ఆరోన్ జార్జ్ అద్భుతంగా రానిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ ఆటగాడు టోర్నీలో వరుసగా మూడు అర్థశతకాలు బాది జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడు. ఆల్‌రౌండర్ కనిష్క్ చౌహాన్ అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
భారత జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఏ పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జ్.
పాకిస్థాన్ జట్టు: ఫర్హాన్ యూసుఫ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సుభాన్, అహ్మద్ హుస్సేన్, అలీ హసన్ బలోచ్, అలీ రజా, దానియల్ అలీ ఖాన్, హమ్జా జహూర్ (వికెట్ కీపర్), హుజైఫా అహసన్, మోమిన్ కమర్, మహమ్మద్ సయ్యమ్, మహమ్మద్ షాయన్ (వికెట్ కీపర్), నకాబ్ షఫీక్, సమీర్ మిన్హాస్, మహమ్మద్ హుజైఫా.
Read Also: ధర్మరాజునే మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Follow Us On: Youtube


