కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్ స్టీన్ ఫైల్స్ (Epstein Files) కుంభకోణంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అమెరికా న్యాయశాఖ ఈ జెఫ్రీ ఎప్ స్టీన్ కు చెందిన ఫైల్స్ ను బయటపెడుతోంది. నిన్న విడుదల చేసిన ఎప్ స్టీన్ ఫైల్స్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) తో పాటు పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ లాంటి వారు కూడా ఉన్నారు. అయితే గడిచిన 24 గంటల్లో ఇందులోని 16 ఫైల్స్ డేటా మాయం అయినట్టు తెలుస్తోంది. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో పాటు ఆయన భార్య మెలానియా, ఎప్ స్టీన్, అతని క్రైమ్ పార్ట్ నర్ గిస్లేన్ మ్యాక్స్ వెల్ లకు సంబంధించిన కీలక డేటా ఉందని డెమొక్రాట్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ఫైల్స్ మాయం కావడంపై ఇప్పటి వరకు వైట్ హౌస్ (White House) క్లారిటీ ఇవ్వలేదు. పొరపాటున జరిగిందా లేదంటే వేరే ఇంకేదైనా కారణం ఉందా అనే దానిపై అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ట్రంప్ గతంలో ఎప్ స్టన్ ను కలిసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఓ మైనర్ బాలిక గురించి మాట్లాడుకున్నారని రీసెంట్ గా ఓ న్యూస్ అమెరికన్ మీడియాలో వైరల్ అయింది. మరి ఆ ఫైల్స్ (Epstein Files)లో ఏముందో బయటకు వస్తే క్లారిటీ వస్తుంది.
Read Also: వీసాల ఆలస్యం.. ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక
Follow Us On: Instagram


