కలం వెబ్ డెస్క్ : ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) మనవడు జిష్ణు ఆర్యన్(Jishnu Aryan) గిన్నిస్ బుక్(Guinness Book) ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒకే నిమిషంలో 216 డెసిమల్స్(దశాంశాలు), గోల్డెన్ రేషియోను అనర్గళంగా చెప్పి ఈ ఘనత సాధించాడు. ఈ విషయాన్ని గంటా శ్రీనివాస రావు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన మనవడు గిన్నిస్ రికార్డు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఏకాగ్రత, గ్రహణ శక్తితో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడని పేర్కొన్నారు. ఆర్యన్ తల్లిదండ్రులు రవితేజ, శరణి దంపతులను అభినందించారు.
Read Also: ఆసియా కప్ ఫైనల్.. అందరి కళ్లు ఇద్దరిపైనే..
Follow Us On: X(Twitter)


