కలం వెబ్ డెస్క్ : సోమవారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాష్ట్ర మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) ఫలితాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చించనున్నారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో జిల్లాల వారీగా ఫలితాలు, ఎవరెవరి సారథ్యంలో ఎన్ని స్థానాలు గెలిచామనే దానిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సొసైటీ ఎన్నికల నిర్వహణకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Read Also: మూడు బహిరంగ సభలు పెట్టబోతున్న కేసీఆర్..?
Follow Us On: Pinterest


