epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సీతాఫలం ఎంత అండర్‌రేటెడ్ ఫ్రూటో తెలుసా?

కలం డెస్క్: సీతాఫలం (Custard Apple) చూడటానికి పచ్చగా, గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంది. ఇది బయటకు సాధారణంగా కనిపించినా, లోపల మాత్రం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పోషకాల గని దాగి ఉంది. ఈ పండు మోస్ట్ అండర్ రేటెడ్. ఎన్నో లాభాలను కలిగించే ఈ సీతాఫలం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. చాలా మంది నిపుణులు కూడా దీనిని పెద్దగా సూచించారు. కానీ దీనిని తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా 45 ఏళ్లు దాటినవారికి ఈ పండు ఓ సహజ ఔషధంలా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌, వసంత్‌కుంజ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, హెపటాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శుభమ్ వాట్స్యా ప్రకారం, కస్టర్డ్ ఆపిల్‌లోని పోషకాలు వయసుతో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఏమేమి పోషకాలు ఉన్నాయి?

కస్టర్డ్ ఆపిల్‌ తెల్లని గుజ్జులో విటమిన్ C, విటమిన్ B6, మ్యాగ్నీషియం, పొటాషియం, సహజ ఫైబర్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, అంతర్గత అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

విటమిన్ C

విటమిన్ C శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది. దీని వల్ల చర్మం త్వరగా వృద్ధాప్య లక్షణాలు చూపకుండా ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగేకొద్దీ ఇమ్యూనిటీ తగ్గే వారికి ఇది ఎంతో ఉపయోగకరం.

గుండె ఆరోగ్యానికి

కస్టర్డ్ ఆపిల్‌లో ఉన్న మ్యాగ్నీషియం గుండె కండరాలను సడలించి, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పొటాషియం హార్ట్ రిథమ్‌ను బ్యాలెన్స్ చేస్తూ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. హైబీపీ సమస్య ఉన్నవారు సరైన పరిమాణంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణవ్యవస్థకు

ఈ పండులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పేగుల కదలిక మెరుగుపడుతుంది. గట్ లైనింగ్‌ను సహజంగా కాపాడుతూ అసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. తరచూ జీర్ణ సమస్యలు ఎదుర్కొనే వారికి ఇది మంచి ఎంపిక.

ఎముకలు, కీళ్ల బలానికి సహాయం

మ్యాగ్నీషియం, కాల్షియం శోషణను పెంచి ఎముకల బలాన్ని కాపాడుతుంది. 45 ఏళ్ల తర్వాత ఎముకలు బలహీనపడటం సాధారణం. ఆ సమయంలో కస్టర్డ్ ఆపిల్‌ వంటి పోషకాలు ఉన్న పండ్లు తీసుకోవడం చాలా అవసరం.

సహజ శక్తి

కస్టర్డ్ ఆపిల్‌లో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసట, నీరసం, బలహీనతతో బాధపడేవారికి ఇది ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. ఆకలి తగ్గినప్పుడు కూడా ఇది శక్తినిస్తుంది.

మెదడు ఆరోగ్యానికి కూడా మేలు

విటమిన్ B6 ఉండటం వల్ల నరాల వ్యవస్థ బలపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి, మూడ్ స్వింగ్స్ తగ్గడానికి ఇది సహాయపడుతుంది. వయసు పెరిగేకొద్దీ మానసిక ఒత్తిడి పెరిగే వారికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.

ఎవరు జాగ్రత్తగా తీసుకోవాలి?

కస్టర్డ్ ఆపిల్‌(Custard Apple)లో సహజ చక్కెర పరిమాణం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారు పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. రోజుకు ఒక చిన్న పండు లేదా అర పండు సరిపోతుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Read Also: ఫైబర్ పుష్కలంగా ఉండే ఎనిమిది ఫ్రూట్స్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>