epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫైబర్ పుష్కలంగా ఉండే ఎనిమిది ఫ్రూట్స్

కలం డెస్క్: ప్రతి ఒక్కరికీ అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిలో చాలా వాటికి మన కడుపే కారణం అవుతుంది. అందులో ఏది వేస్తే దాన్ని అది మనకి తిరిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. జంక్ ఫుడ్ తింటే మన శరీరాన్ని జంక్‌గా మారుస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో వస్తున్న మార్పులు, పౌష్టికత లేని ఆహారాల వల్ల కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అజీర్ణం, అసిడ్‌ రిఫ్లక్స్‌ వంటి అనేక సమస్యలను ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు ఎదుర్కొనే వారు ఫైబర్‌ ఎక్కువగా కలిగిన పండ్లు (Fiber Rich Fruits) ఆరోగ్యానికి ఉత్తమ పరిష్కారమని పోషక నిపుణులు చెబుతున్నారు. ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేయించడమే కాకుండా, గుడ్ బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతోంది. దాంతో పాటుగా మన కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న ఫీల్‌ను కలిగిస్తుంది. అంటే మాటిమాటికి ఆకలి వేస్తున్నట్లు కానీ, ఏదైనా తినాలి అన్నట్లు కానీ అనిపించదు. మరి ఫైబర్ అధికంగా ఉండే పండ్లు ఏంటా? అని ఆలోచన రావొచ్చు. తాజాగా నిపుణులు సూచించిన ఎనిమిది పండ్లు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.

ఫైబర్ అధికంగా ఉండే పండ్లు (Fiber Rich Fruits)

ప్యాషన్‌ ఫ్రూట్‌

ప్యాషన్ ఫ్రూట్‌లో కరిగే (Soluble) మరియు కరిగని (Insoluble) ఫైబర్‌లు ఉండటం దీని ప్రత్యేకత. ఇది జీర్ణనాళంలో నీటిని నిల్వ ఉంచి స్టూల్‌ను మృదువుగా చేస్తుంది. ముఖ్యంగా బద్ధకష్టం, అజీర్ణం ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. గట్ మొవ్‌మెంట్‌ను రెగ్యులర్‌గా ఉంచడం దీని ప్రధాన లాభం.

జామ పండు

100గ్రా గ్వావాలో 5–6గ్రా ఫైబర్‌ ఉండడం దీన్ని ఫైబర్‌ రిచ్‌ ఫలంగా నిలబెడుతోంది. ఇందులోని విత్తనాలు ఇన్సొల్యూబుల్ ఫైబర్‌గా పనిచేస్తూ పేగుల కదలికను సులభం చేస్తాయి. భారతీయ ఆహారంలో సులభంగా దొరికే ఆరోగ్యకర పండ్లలో ఇది ఒకటి.

పేర్

పేర్‌లో విపరీతంగా ఉండే పెక్టిన్‌ ఫైబర్‌ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మంతో తిన్నప్పుడు ఫైబర్‌ పరిమాణం రెట్టింపు అవుతుందని నిపుణుల అభిప్రాయం. ఇది బ్లడ్ షుగర్‌ను నెమ్మదిగా పెంచడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

రాస్ప్‌బెర్రీస్

100గ్రా రాస్ప్‌బెర్రీస్‌లో 6–7గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్‌ షుగర్‌, కోలెస్ట్రాల్‌ మరియు హార్ట్‌ హెల్త్‌ కోసం ఎంతో మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల యాంటీ ఏజింగ్‌ ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

ఆపిల్

చర్మంతో తిన్న ఆపిల్‌లో సుమారు 4–5గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తింటే డిటాక్సిఫికేషన్‌ ప్రభావం మరింతగా ఉంటుంది.

అరటి పండు

100గ్రాలో 2.6–3గ్రా ఫైబర్‌ ఉండే అరటిపండు సాధారణంగా అందరికీ పరిచితమైనది. పూర్తిగా పండని అరటిపండులో ఉండే రెసిస్టెంట్‌ స్టార్చ్‌ గట్‌ మైక్రోబయోమ్‌ను బలపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వారంలో 3–4 అరటిపండ్లు తిన్నవారిలో IBS లక్షణాలు తగ్గినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్లాక్‌బెర్రీస్

బ్లాక్‌బెర్రీస్‌లో 5–7గ్రా ఫైబర్‌ ఉంటుంది. ఇవి గట్‌ ఆరోగ్యమే కాకుండా రక్తంలో షుగర్‌ నియంత్రణ, హృదయ ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వల్ల ఇది సూపర్ ఫుడ్‌గా పరిగణించబడుతుంది.

కీవీ

100గ్రా కీవీలో 3–4గ్రా ఫైబర్‌ ఉంటుంది. ఇది బౌవెల్‌ మూవ్‌మెంట్‌ను సహజంగా, నొప్పిలేకుండా రెగ్యులర్‌గా ఉంచుతుంది. రాత్రి భోజనం తర్వాత ఒక కీవీ తింటే నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందని అధ్యయనాలు నిర్ధారించాయి.

రోజుకెంత ఫైబర్ కావాలి

ప్రతి మనిషికి ఫైబర్ చాలా ముఖ్యం. కానీ అది ఎక్కువగా తీసుకున్నా కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రోజుకు కనీసం 25–30గ్రా ఫైబర్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పండ్లు ఆ లక్ష్యాన్ని సహజంగానే చేరుకునేందుకు ఉపయోగపడతాయి.

Read Also: చైనా నాటిన చెట్లు.. దేశంలో నీటిని పంపిణీనే మార్చేశాయ్..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>