కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని (Manthani) నియోజకవర్గానికి మరో మణిహారం రానున్నది. మంథని మండలంలోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు మానేరు నదిపై (Maneru River) 1.120 కిలో మీటర్ల పొడవు 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 203 కోట్లు విడుదల చేసింది. ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుండి బ్రిడ్జి వరకు.. రెండు వైపుల దామెరకుంట రోడ్డు వరకు 9.53 కిలో మీటర్ల అప్రోచ్ రోడ్డుకు నిధులు విడుదల అయ్యాయి. కొత్త వంతెన నిర్మాణం పూర్తి అయితే పెద్దపల్లి (Peddapalli) జిల్లా మంథని (Manthani) మండల ప్రజలతో పాటు ఇతర ప్రయాణికులకు కాళేశ్వరం దేవాలయానికి దూర భారం తగ్గనుంది. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Read Also: వీకెండ్ డెస్టినేషన్ గా వరంగల్.. బ్రోచర్ ఆవిష్కరించిన కొండా సురేఖ
Follow Us On: Sharechat


