కలం, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు (Taj Mahal) కారణంగా ఆగ్రాలోని(Agra) తాజ్ మహల్ కనిపించడం లేదు. పొగమంచు ప్రభావంతో ఢిల్లీ సహా ప్రముఖ నగరాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఢిల్లీలో ఓ వైపు పొగమంచు, మరోవైపు వాయు కాలుష్యంతో జనం నరకం అనుభవిస్తున్నారు. అయితే తాజాగా ఈ పొగమంచు కారణంగా ఆగ్రాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం తాజ్ మహల్ కనిపించకపోవడంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. ఎంతో దూరం నుంచి వచ్చిన దేశీయ, విదేశీ పర్యాటకులు తాజ్‌మహల్‌ను చూడలేక నిరుత్సాహంగా వెనుదిరగాల్సి వస్తోంది. కొందరు పర్యాటకులు పొగమంచు తగ్గే వరకు ఎదురుచూసినా, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దీంతో తాజ్ మహల్(Taj Mahal) చూడకుండానే పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.
పొగమంచు కారణంగా ఆగ్రాతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ఇదే ప్రభావం కనిపిస్తోంది. రోడ్డు, రైలు, విమాన రవాణాపై కూడా ప్రభావం పడుతున్నట్లు సమాచారం. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ (IMD) ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో కూడా పొగమంచు కొనసాగుతుందని, ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పొగమంచు ప్రభావంతో ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: గ్రామీణ ఉపాధిపై మోడీ బుల్‌డోజర్లు : సోనియా
Follow Us On: Pinterest


