కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సాగునీటిపారుదల శాఖలో (Irrigation Department) వచ్చే కొత్త ఏడాది నాటికి ఒకేసారి 68 మంది రిటైర్మెంట్ కాబోతున్నారు. ఇందులో అందరూ ఉన్నతాధికారులే ఉన్నారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ ఒకరు, చీఫ్ ఇంజినీర్స్ 11 మంది, సూపరింటెండింగ్ ఇంజినీర్స్ 9 మంది, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ 30 మంది, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ 17 మంది ఉన్నారు. ఇంతమంది ఒకే శాఖలో ఒకేసారి రిటైర్మెంట్ కావడం చాలా అరుదు. తెలంగాణలో నీటిపారుదల శాఖ అత్యంత కీలకమైనది. ఇందులో ఇంజినీర్లు లేకుండా నడిపించడం చాలా కష్టంగా మారుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ ఖాళీ అవుతున్న పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు.
ఒకవేళ ఇంకో రెండు నెలల వరకు నోటిఫికేషన్ ఇచ్చినా ఎగ్జామ్, ఫైనల్ రిజల్ట్ రావడానికి ఎంత టైమ్ పడుతుందో చెప్పలేం. ఎవరైనా కోర్టు కేసులు వేస్తే అది మరింత ఆలస్యం అవడం ఖాయం. మరి అప్పటి దాకా ఇంజినీర్లు లేకుండా ఈ డిపార్టుమెంట్ (Irrigation Department) ను ఎలా నడిపిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రాజెక్టుల్లో ప్రస్తుతానికి నీళ్లు బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ నీటిని ప్రస్తుతం యాసంగి పంటకు తగినట్టుగా వాడుకోవాలి. మరి ప్రభుత్వం అత్యవసరంగా వేరే డిపార్టుమెంట్ లో ఉన్న వారిని ఇందులోకి తీసుకొస్తుందా లేదంటే నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తుందా అనేది వేచి చూడాలి.
Read Also: మంథని సిగలో మరో మణిహారం.. మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జి
Follow Us On: Youtube


