కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ (Pakistan) కు చెందిన వెల్డర్ నసీముద్దీన్ (Naseemuddin) 74 ఏళ్ల వయసులోనూ అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపిస్తూ, ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) లో హ్యాట్రిక్ సాధించారు. తాజాగా నసీముద్దీన్ తన చేతిలో ఒక గుడ్డును పట్టుకుని, ఏకంగా 38 మార్బుల్ టైల్స్‌ను పగలగొట్టి కొత్త రికార్డు నెలకొల్పారు.
గతంలో ఉన్న 30 టైల్స్ రికార్డును అధిగమిస్తూ ఈ ఘనతను సాధించారు. గిన్నిస్ సంస్థ దీనిని అధికారికంగా ధృవీకరించి, తమ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. ఇది ఆయనకు తొలి రికార్డు కాదు. ఇంతకుముందే ఒకే దెబ్బతో 163 వాల్‌నట్‌లను పగలగొట్టడం, అలాగే ఒక చేత్తో ఆపిల్స్‌ను నలిపేయడం వంటి అరుదైన ఘనతలు సాధించారు.

