కరీంనగర్(Karimnagar) జిల్లాలో ఘోరం జరిగింది. వరకట్న వేధింపులను తట్టుకోలేక నిండు గర్భిణి ప్రాణాలు విడించంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే యువతికి, భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో వివాహం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్ళి జరిగింది. కాగా కొంతకాలంగా అదనపు కట్నం కోసం ప్రశాంత్ వేధించడం ప్రారంభించాడు.
Karimnagar | ఇక వాటిని తట్టుకోలేక 7నెలల గర్భంతో ఉన్న మౌనిక.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై మౌనిక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తన కూతురు చావుకు కారణమైన ప్రశాంత్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ‘డిజిటల్ అరెస్ట్’తో రూ. 31 కోట్లకు టోకరా
Follow Us on : Pinterest

