నార్సింగిలో అమానుషం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్​ లో మరో అమానుష ఘటన జరిగింది. నార్సింగి (Narsingi) ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై మానవ రూపంలో ఉన్న ఓ మృగం అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. చాక్లెట్​ ఇప్పిస్తానని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్​ ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్​ ను పరిశీలించగా.. ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.

నిందితుడిని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకుని బాలిక మృతదేహాన్ని చూపించాడు. అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, గతంలోనూ నార్సింగి (Narsingi) ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>