epaper
Wednesday, February 18, 2026
epaper

51 మంది మావోయిస్టుల లొంగుబాటు

కలం, వెబ్​డెస్క్​: నక్సలైట్లకు మరో భారీ ఎదురుదెబ్బ. ఛత్తీస్​గఢ్​లో శనివారం 51 మంది నక్సల్స్​ ఆయుధాలతో సహా లొంగిపోయారు(Maoists Surrender ). ఈ మేరకు బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​ పట్టిలింగం వివరాలు వెల్లడించారు. లొంగిపోయినవాళ్లపై రూ.1.61కోట్లు రివార్డు ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే వీళ్లలో 34 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. 30 మంది బీజాపూర్​ జిల్లా కేంద్రంలో, మరో 21 మంది సుక్మా జిల్లాలో లొంగిపోయినట్లు ఆయన చెప్పారు.

నక్సల్స్​ను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు అమలుచేస్తున్న ‘పూనా మార్గం’ పునరావాసం కార్యక్రమంలో భాగంగా వీళ్లు లొంగిపోయినట్లు ఆయన వెల్లడించారు (Maoists Surrender ). దేశాన్ని ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్​ రహితంగా చేయాలనే కేంద్రం ప్రయత్నాల్లో ఇది మరొక భారీ విజయమని ఆయన అన్నారు. కాగా, ఛత్తీస్​గఢ్​లో గిరిజనుల పండుగ అయిన ‘బస్తర్​ పందుం 2026’ వేడుకల్లో పాల్గొనేందుకు జగదల్​పూర్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హాజరవుతున్న సమయంలోనే భారీ సంఖ్యలో నక్సల్స్​ లొంగిపోవడం గమనార్హం.

Read Also: అర్ధరాత్రి అబ్బాయిలతో వెళ్లిన గురుకుల విద్యార్థినులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>