కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026లో బోణీ కొట్టాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)కు గట్టి షాక్ తగిలింది. హోమ్ గ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన లక్నో తీరుపై మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ (Abhinav Mukund) తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు ఆ జట్టుకు ఒక స్పష్టమైన గుర్తింపే లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బుధవారం ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో, అక్షర్ పటేల్ సేన నిర్దేశించిన 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా లక్నో కాపాడుకోలేకపోయింది. ఈ ఓటమిపై స్పందించిన ముకుంద్.. లక్నో జట్టు బలబలాల విషయంలో తనకు క్లారిటీ లేదన్నారు. అదే సమయంలో ఐపీఎల్‌లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్‌తో పోలిస్తే, లక్నో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని నిర్మించుకోవడంలో విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిందని, వారు అనుభవంపై ఆధారపడి స్పష్టమైన ప్లాన్‌తో ఆడుతున్నారని ముకుంద్ పేర్కొన్నారు. కానీ లక్నో జట్టు మాత్రం గత రెండు సీజన్లలో రాణించినా, కొత్త వ్యూహాలతో వచ్చినా ఇంకా గుర్తింపు కోసం తడబడుతోందని విమర్శించారు. ఫలితాల్లో కూడా గుజరాత్ స్థాయిలో లక్నో రాణించలేకపోతోందని ఆయన (Abhinav Mukund) విశ్లేషించారు. రిషబ్ పంత్ సారధ్యంలోని లక్నో జట్టు ఏప్రిల్ 05న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌తోనైనా లక్నో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చి తన తొలి ఐపీఎల్ టైటిల్ కలని నిజం చేసుకుంటుందో లేదో చూడాలి.
Read Also: హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఇంట్రెస్టింగ్ వీడియో
Follow Us On: Instagram

