కలం వెబ్ డెస్క్ : పుస్తక ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన(National Book Fair)కు సమయం ఆసన్నమైంది. శుక్రవారం నుంచి నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium)లో 38వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు జరుగనున్న ఈ ప్రదర్శనలో వందలాది సంస్థలు తమ పుస్తకాలతో పాఠకులకు ఆహ్వానం పలుకనున్నాయి. నేడు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తారు. ఏటా నగర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ పుస్తక ప్రదర్శనకు తరలివస్తారు. నేడు ఈ వేడుకకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కమిటీ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు తదితరులు హాజరుకానున్నారు.
ఈ బుక్ ఫెయిర్(National Book Fair) గతేడాది 350 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 365 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది 12 లక్షల సందర్శకులు రాగా, ఈసారి 15 లక్షల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. మీడియా, రచయితలకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది. సందర్శకులకు రూ.10 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు. విద్యార్థులు ఉచితంగానే హాజరుకావచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి నచ్చిన పుస్తకాలు కొనేయండి!
Read Also: పబ్‌లు, ఫామ్‌హౌస్‌ల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Follow Us On: Pinterest


