కలం, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అలర్ట్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని పబ్‌లు, ఫామ్‌హౌస్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని కొన్ని పబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటాక కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నగరవ్యాప్తంగా న్యూ ఇయర్ పార్టీల(New Year Parties) నిర్వహణపై గట్టి నిఘా పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత పబ్‌లు, క్లబ్‌లు తెరిచి ఉంచడం నిషేధమని, ఆ నిబంధనను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకలకు నగరంలోని పబ్‌లు, ఫామ్ హౌస్ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో పార్టీలు ప్లాన్ చేయడంతో పోలీసులు ముందస్తు చర్యలుగా భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా డ్రగ్స్ వినయోగించే అవకాశం కూడా ఉంది. దీంతో పోలీసులు (Hyderabad Police), ఈగల్ టీమ్ (EAGLE Team) ఆధ్వర్యంలో రెయిడ్స్ కొనసాగుతున్నాయి.
Read Also: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు విచారణ
Follow Us On: X(Twitter)


