పవన్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి కీలక అప్డేట్​

కలం, వెబ్​ డెస్క్​: చిరంజీవి (Chiranjeevi) తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) నిర్వహించిన సర్జరీ విజయవంతంగా ముగిసిందని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని చిరంజీవి స్పష్టం చేశారు. పూర్తిగా కోలుకుని పవన్ తిరిగి రావడానికి సుమారు ఒక వారం రోజుల సమయం పట్టవచ్చని చిరు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల అభిమానులు చూపించిన ప్రేమకు, ప్రార్థనలకు చిరంజీవి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఎంఆర్ఐ (MRI) పరీక్షల అనంతరం వైద్యులు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Read Also: అయ్యో అబ్బాయ్​.. లేదోయ్​ జోడీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>