కలం వెబ్ డెస్క్ : ఇండోనేషియా(Indonesia) ప్రధాన ద్వీపమైన జావా(Java Island)లో సోమవారం అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డుపై నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ దిమ్మెను ఢీకొని పక్కకు బోల్తా పడిందని రెస్క్యూ ఏజెన్సీ అధిపతి బుడియోనో తెలిపారు. జకార్తా నుంచి యోగ్యకర్తాకు వెళ్తున్న ఈ బస్సు సెమరాంగ్ నగరంలో క్రాప్యాక్ టోల్ వేలో ఎగ్జిట్ ర్యాంప్‌లోకి ప్రవేశిస్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. బస్సు వేగంగా కాంక్రీట్ దిమ్మెను ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారన్నారు.
ప్రమాదం జరిగిన 40 నిమిషాల తర్వాత పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నారు. ముందుగా బస్సులోనే మరణించిన ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను సమీపంలోని రెండు ఆస్పత్రులకు తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా కొందరు, చికిత్స పొందుతుండగా మరికొందరు చొప్పున మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
Read Also: సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్ట్ నోటీసులు
Follow Us On: Youtube


