బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

కలం, వెబ్ డెస్క్: ఒడిశా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Odisha Congress) కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ అధిష్ఠానం మంగళవారం సస్పెండ్‌ చేసింది. రమేష్‌ జెనా, దాశరథి గమాంగో, సోఫియా ఫిర్దౌస్‌లను పార్టీ నుండి సస్పెండ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రమేష్‌ జెనా, దాశరథి గమాంగో, సోఫియా ఫిర్దౌస్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసి క్రాస్‌ ఓటింగ్‌కి పాల్పడ్డారు. వారినుంచి ఇలాంటి చర్యలను ఊహించని కాంగ్రెస్.. క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం వారిని బహిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (Congress) కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ మీడియాకు స్పష్టం చేశారు. మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు‌గాను మూడు స్థానాలను ఎన్‌డీఏ కూటమి, ఒక స్థానాన్ని బీజేడీ గెలుచుకున్నాయి. దీంతో కాంగ్రెస్‌ ఓడిపోయింది.

Read Also: అమ్మాయిలు, ఆంటీల మాటలు నమ్మి యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? బీ అలర్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>