epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వివాహాల్లో ‘సోషల్ మీడియా’ చిచ్చు.. కారణాలివే!

కలం, వెబ్ డెస్క్: Indore – Social Media |  టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకా మొబైల్ వాడకం పెరిగింది. దీంతో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఊంటూ తమ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రభావం పెళ్లిలపై చూపుతోంది. బెంగళూరుకు చెందిన ప్రవీణ్, శ్వేత చాలాకాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఒకే చెప్పడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో అర్ధాంతరంగా వారి పెళ్లి ఆగిపోయింది. సోషల్ మీడియాలో ప్రవీణ్‌కు చెందిన వ్యక్తిగత విషయాలు అమ్మాయి కుటంబ సభ్యులు తెలుసుకోవడం, అబ్బాయిపై చెడు అభిప్రాయం ఏర్పడటంతో పెళ్లి క్యాన్సల్ అయ్యింది. ఇలా ఒకరు కాదు. ఇద్దరు కాదు.. చాలామంది పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. దీనికి కారణం సోషల్ మీడియానే తెలుస్తోంది.

ఇటీవల ఇండోర్‌ (Indore)లో 40 రోజుల్లోనే 150‌కుపైగా వివాహాలు రద్దయ్యాయి. చాలా వరకు వివాహాలు రద్దు కావడం వెనుక పాత సోషల్ మీడియా పోస్టులు లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కారణంగా తెలిసింది. ఎన్నో సంవత్సరాలు క్రితం చేసిన పోస్ట్ చివర దశలో పెళ్లి ఆగిపోయేలా చేస్తున్నాయి. క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఇలాగే రదయ్యింది. పలాష్ ముచ్చల్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెళ్లి క్యాన్సల్ అయ్యింది. ఇలా అనేక వివాహాలు రద్దవుతున్నాయి. చివరి నిమిషంలో పెళ్లిళ్లు క్యాన్సల్ కావడంతో క్యాటరర్లు, ఫోటోగ్రాఫర్లు, డెకరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండు కుటుంబాలపై భావోద్వేగ ప్రభావం చూపుతోంది. చిన్న చిన్న ఆన్‌లైన్ పోస్ట్‌లు కూడా పెళ్లిళ్లపై ప్రభావం చూపుతుండటంతో రద్దవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read Also: బెంగాల్‌లో ‘సర్’ చిచ్చు.. 58 లక్షల ఓట్లు గాయబ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>