Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ లో ఆర్టీసీ అద్దె బస్సును ఢీకొట్టిన లారీ..

కలం,  నిజామాబాద్ బ్యూరో:  నిజామాబాద్ (Nizamabad) జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామం జాతీయ రహదారి 44 పై ఆర్టీసీ అద్దె బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణీకులు గాయాలయ్యాయి. కామారెడ్డి నుండి ఆర్మూర్ వస్తున్న ఆర్.టీ.సీ. టి.యస్.16.యు.బీ.2255. నెంబర్ గల అద్దె బస్సు ను అర్గుల్ గ్రామంలో ప్రయాణికులు దిగుతున్న సమయంలో వెనుక నుండి హర్యానా రాష్ట్రానికి చెందిన యచ్.ఆర్‌46.యు 5859 నెంబర్ గల లారీ ఢీకొట్టింది. హుటాహుటిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అంతకుముందే క్షతగాత్రులను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్మూర్ కు తరలించాలని ఆదేశించారు.

అనంతరం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోడ్ స్టాపర్లు రోడ్డు డివైడర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ను నియంత్రించి వాహనాలను జెసిబి సహాయంతో పక్కకు తరలించారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్య సేవల కోసం క్షతగాత్రులను నిజామాబాదు (Nizamabad) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ , జక్రాన్ పల్లి ఇంచార్జి ఎస్సై డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ , ఇందల్వాయి ఎస్సై సందీప్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు వైద్య సిబ్బంది తదితరులు సీపీ తో ఉన్నారు.

Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>