‘జాంబీ రెడ్డి 2’ నెక్ట్స్ లెవల్ అనౌన్స్ మెంట్ అదిరిందిగా..!

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో తేజ సజ్జా బర్త్ డే నేడు. ఈ సందర్భంగా తేజ సజ్జా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జాంబీ రెడ్డి ‘ చిత్రానికి సీక్వెల్ ‌గా వస్తున్న మూవీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి ‘జాంబీ రెడ్డి 2 – నెక్ట్స్ లెవల్ ‘  అని టైటిల్ ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్ (Zombie Reddy 2 Glimpse) రిలీజ్ చేశారు. ఫోక్ సింగర్ నాగవ్వ గొంతుతో పాడే పాటతో గౌర హరి మ్యూజిక్ తో వచ్చిన ఈ గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉండి అడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది.

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ మూవీతో సుపర్న్ ఎస్. వర్మ టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర , అందాల తార షనయా కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, నేపాలి, జపనీస్ భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ 2027లో రిలీజ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>