కలం, వెబ్ డెస్క్: విజయనగరం (Vizianagaram) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనం బోల్తా పడిన ఘటనలో కానిస్టేబుల్ మరణించారు. ఓ కేసు విచారణకు వెళ్లొస్తున్న క్రమంలో గాజులరేగు సమీపంలోని కొండకరకం ఘాటు వద్ద వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ రమణ (45) మృతి చెందారు. ఎస్సై అశోక్, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. బ్రేకులు విఫలం కావడంతోనే వాహనం బోల్తా కొట్టిందని సిబ్బంది చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

