కలం. వెబ్ డెస్క్ : బీహార్, బెంగళూరు రాష్ట్రాల్లో కొత్త రకం డ్రగ్ (Zombie Drug) కలకలం రేపుతోంది. దీనిని తీసుకున్న వారు స్పృహలో ఉన్నప్పటికీ, మెదడుపై నియంత్రణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక యువకుడు ‘జైల్‌జైన్’ అనే ప్రమాదకరమైన డ్రగ్ సేవించి, రోడ్డుపై ఒక బొమ్మలాగా గంటల తరబడి కదలకుండా నిలబడిపోయాడు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, కనీసం కనురెప్ప కూడా వేయకుండా గంటల పాటు ఉండిపోయిన ఆ యువకుడిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ వింత ప్రవర్తనకు కారణమైన డ్రగ్ మెదడు పనితీరును పూర్తిగా స్తంభింపజేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో దీనిని జాంబీ డ్రగ్ (Zombie Drug) అని పిలుస్తున్నారు. ఈ డ్రగ్ బారిన పడిన వారు తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలోకి వెళ్లిపోతారని, ఇది ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరు లోనూ..
బెంగళూరు నగరంలోనూ ప్రమాదకరమైన జాంబీ డ్రగ్ ప్రవేశించడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ మాదకద్రవ్యాన్ని సేవించిన వారు తమ శరీరాలపై నియంత్రణ కోల్పోయి వింతగా తూలుతూ, గంటల తరబడి ఒకే చోట బొమ్మల్లా నిలబడిపోతుండటం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. దీనిని తీసుకున్న వ్యక్తులు వికృతమైన భంగిమల్లో కదలకుండా ఉండటం చూస్తుంటే హాలీవుడ్ సినిమాల్లోని ‘జాంబీ’లను తలపిస్తున్నారని, అందుకే ఇంటర్నెట్‌లో దీనికి ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది. నగరంలో ఈ మత్తు పదార్థాల విక్రయాల వెనుక ఉన్న ముఠాల గురించి పోలీసులు నిఘా పెంచారు. యువత ఇలాంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘జాంబీ డ్రగ్’ కలకలం.. ఎలా అయిపోతున్నారో చూడండి!#ZombieDrug #Bihar #Bengaluru #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/OiDSaYB65e
— Kalam Daily (@kalamtelugu) April 8, 2026
Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం
Follow Us On : WhatsApp

