ఓటీటీలోకి పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

కలం, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ థియేటర్లను ఊపేస్తోంది. ఉగాది సందర్భంగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఓజీ భారీ విజయం తర్వాత పవన్ మళ్లీ తెరపైకి రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే రూ.10.6 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు సృష్టించింది. యాక్షన్ సీక్వెన్స్‌లలో పవన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నప్పటికీ, కథనం కొంతవరకు ఊహించదగ్గదిగా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ మూవీ వసూళ్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం.

సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగానే, దీని ఓటీటీ విడుదలపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా విడుదలైన సుమారు ఐదు వారాల తర్వాత (అంటే సుమారు 35 రోజులు) ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని నిర్మాత నవీన్ యెర్నేని గతంలో సూచించారు. దీని ప్రకారం.. ఏప్రిల్ 23 తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రావొచ్చు. సెలవుల సీజన్ కావడంతో ఈ గ్యాప్‌లో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read Also: చిన్నారి కోరిక తీర్చిన విజయ్-రష్మిక జంట

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>