కలం, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు 12వ రోజు ప్రారంభమయ్యాయి. శాసన మండలిలో వైసీపీ (YSRCP) సభ్యులు మళ్లీ తిరుపతి లడ్డూపై చర్చకు డిమాండ్ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తుండగా ఆయన స్పీచ్‌ను అడ్డుకొని చైర్మన్ ఎదుట నినాదాలు చేశారు. లడ్డూపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. వైసీపీ సభ్యుల తీరుపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ కుర్చీకి కనీస గౌవరం ఇవ్వడం లేదని విమర్శించారు. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు తిరుమల లడ్డూపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. కానీ, వైసీపీ సభ్యులే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తీవ్ర గందరగోళం నడుమ చైర్మన్ సభను వాయిదా వేశారు. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ చేస్తున్న దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే చర్చ పెట్టడం లేదని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎదుట బ్యానర్లతో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు.

