కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Kavitha Liquor Case) లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిపై సరైన సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు తప్పు చేశారని నిరూపించేందుకు అవసరమైన బలమైన ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ విచారణలో కోర్టు ఇచ్చిన తీర్పు కవిత, ఇతర నిందితులకు ఊరటగా మారింది.
Read Also: టార్గెట్ హరీశ్ రావు.. సిద్దిపేటలో కవిత మరో కీలక అడుగు
Follow Us On: Sharechat

