epaper
Sunday, March 1, 2026
epaper

హరీష్‌ శంకర్ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ ఫైర్.. మొదలైన రచ్చ

కలం, డెస్క్ : ఏపీ రాజకీయాల్లో సినిమాల ప్రభావం ఎక్కువగానే ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదైనా హీరో సినిమాలో ఏపీ పాలిటిక్స్ కు సింక్ అయ్యేలా ఒక్క డైలాగ్ కనిపించినా సరే.. రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ చేసిన కామెంట్లతో మళ్లీ రాజకీయ రచ్చ స్టార్ట్ అయిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్ (Harish Shankar) డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్. ఈ మూవీ రెండో సాంగ్ ను నిన్న రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కొన్ని కామెంట్లు చేశారంటూ.. హరీష్‌ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘ఈ సినిమాలో పొలిటికల్ డైలాగులు ఉంటాయా అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. కానీ అలాంటివి ఏవీ ఉండవు. ఎందుకంటే సినిమాలను ఎంటర్ టైన్ మెంట్ గానే చూడాలని పవన్ కల్యాణ్‌ చెప్పారు. ఉస్తాద్ లో ఎవరినీ కించపరిచేలా డైలాగులు గానీ, సీన్లు గానీ ఉండొద్దని పవన్ సూచించారు. అందుకే అలాంటివి ఏవీ పెట్టట్లేదు’ అన్నారు హరీష్ (Harish Shankar).

ఆయన వీడియోపై వైసీపీ ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే గత ఏపీ ఎన్నికల టైమ్ లో ఉస్తాద్ నుంచి ఓ టీజర్ రిలీజ్ చేశారు. అందులో గాజు గ్లాసు డైలాగులు పెట్టారు. జనసేన గుర్తు అయిన గాజు గ్లాసు మీద అప్పుడు పొలిటికల్ డైలాగులు పెట్టి.. ఇప్పుడు అవేం లేవని సింపతీ కోసం ఇలాంటి మాటలా అంటున్నారు వైసీపీ ఫ్యాన్స్. సినిమాకు పెద్దగా రీచ్ రావట్లేదని ఇలాంటి డైలాగులు కొడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి 26న సినిమా రిలీజ్ కాబోతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్‌ కాంబోలో వస్తున్న సినిమా.. పైగా అదే పోలీస్ గెటప్ లో పవన్ కనిపించడంతో.. అంచనాలు బాగానే ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!