Mobile Popup Ad
Mobile Popup Ad

గంజాయితో బైక్‌పై రయ్ రయ్.. సీన్ కట్ చేస్తే!

కలం, మెదక్ బ్యూరో: బైక్‌పై గంజాయి తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో జరిగింది. అజయ్ కుమార్ అనే వ్యక్తి బైక్‌పై బీదర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడు. ఇదే సమయంలో పోలీసులు జిల్లాలోని పోతిరెడ్డిపల్లి సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. అజయ్ కుమార్‌ను ఆపి బ్యాగ్ తనిఖీ చేయగా 1 కిలో 114 గ్రాముల ఎండుగంజాయి బయటపడింది. నిందితుడు వద్ద నుంచి మొబైల్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌కు చెందిన అజయ్ కుమార్ గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>