ప‌దేళ్లుగా క‌ల్తీ పాలు.. జ‌గ‌న్ ఏం చేశాడు?: వైఎస్ ష‌ర్మిల‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలో ప‌దేళ్లుగా క‌ల్తీ పాల దందా న‌డుస్తోంద‌ని, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ దీనిపై అప్పుడు ఏం చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) ప్ర‌శ్నించారు. రాజ‌మండ్రిలో క‌ల్తీ పాలతో ఆస్ప‌త్రిపాలై చికిత్స పొందుతున్న వారిని ష‌ర్మిల నేడు ప‌రామ‌ర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవ‌లు, వారి ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను ఆరా తీసి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వారితో మాట్లాడారు. అనంతం ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు.

వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఏనాడూ స్పందించ‌ర‌ని విమ‌ర్శించారు. బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లు త‌ప్ప ప్ర‌జ‌ల కోసం చేసిందేంట‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ వాళ్ల‌ పార్టీ నాయ‌కుల‌కు, వాళ్ల పార్టీ కేడ‌ర్‌కు, సైతాన్ సామ్రాజ్యానికి ఏదైనా అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రార‌న్నారు. ప్ర‌భుత్వం క‌ల్తీ పాల‌పై పూర్తి విచార‌ణ చేప‌ట్టాల‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని ష‌ర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు.

Read Also: మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క‌న్నుమూత‌!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>