క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష..

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో క్రీడా రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, SAT చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాస రాజు, శేషాద్రి, SAT ఎండీ సోనీ బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. కిషోర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమావేశంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University)లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన  సౌకర్యాల కల్పనపై విస్తృత చర్చ జరిగింది. ఒలింపిక్స్ (Olympics) లక్ష్యంగా రాష్ట్ర క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం పేర్కొన్నారు.

గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియం (Gachibowli Stadium)ను పునరుద్ధరించడంతోపాటు స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి, వాటిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

భవిష్యత్‌లో ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ (Telangana) ఆతిథ్యం ఇవ్వగలిగేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని, అలాగే ఒలింపిక్స్‌(Olympics) లో తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ చాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, శిక్షణ కార్యక్రమాలు మరియు పోటీల నిర్వహణకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులకు ముఖ్యమంత్రి (Revanth Reddy) ఆదేశించారు.

Read Also: ట్రంప్ డైరెక్షన్‌లో మోదీ పాలన..! : ఎంపీ చామల

Follow Us On: Facebook

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>