కలం, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) భారత్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన వేళ.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా తన రికార్డునే బద్దలు కొట్టిన సంజూ శామ్సన్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజూ ప్రదర్శనపై కోహ్లీ సోషల్ మీడియాలో స్పందించారు.
టోర్నమెంట్ కీలక సమయాల్లో అద్భుతంగా ఆడిన సంజూ (Sanju Samson) నిజమైన ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని పేర్కొన్నారు. అతని విజయంపై చాలా ఆనందంగా ఉందని తెలిపారు. భారత జట్టు దూకుడు క్రికెట్ ఆడిందని కోహ్లీ అభినందించారు. కఠిన పరిస్థితుల్లో ఆటగాళ్లు పోరాడి మరోసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారని తెలిపారు. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ మరో చారిత్రాత్మక టైటిల్‌ను సొంతం చేసుకుంది.
టోర్నమెంట్ మొత్తంలో సంజూ అద్భుతంగా రాణించారు. మొత్తం 321 పరుగులు చేసి టీ20 వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌లో భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టారు. ఈ రికార్డు ముందుగా 2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన 319 పరుగులది. అలాగే సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ అర్ధ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా సంజూ నిలిచారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, షాహిద్ అఫ్రిది ఇప్పటికే ఉన్నారు.
Read Also: గంభీర్ నవ్వుపై ధోనీ క్రేజీ పోస్ట్..!
Follow Us On: Sharechat

