కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) SIR అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల బెంగాల్, తమిళనాడులో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతూ, అక్కడ భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరిగినట్లు పేర్కొన్నారు.
బెంగాల్‌లో (West Bengal) సుమారు 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించారని జగన్ (YS Jagan) అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తప్పనిసరిగా పోటీ చేయాలని జగన్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: రామకుప్పం హత్య కేసు ముగింపు.. తల్లికి జీవిత ఖైదు శిక్ష
Read Also: డిజిటల్ విప్లవం

