తెలంగాణ రైజింగ్(Telangana Rising) 2047కు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. రానున్న రెండు దశాబ్దాలలో రాష్ట్ర ప్రయాణాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. కాగా ఇందులో రాష్ట్ర పౌరులు భాగస్వాములు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం తెలంగాణ రైజింగ్ 2047 పౌర సర్వేను నిర్వహిస్తోంది. ఇందులో అందరూ పాల్గొనాలని కోరుతోంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
Telangana Rising | ‘‘ఈ విజన్‌లో మీ వాణి, మీ ఆలోచనలు కీలకం. విద్య, ఆరోగ్యం నుండి ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), సుస్థిరత (సస్టైనబిలిటీ) వరకు… మనం కలిసి నిర్మించబోయే భవిష్యత్తును నిర్వచించడంలో ప్రతి పౌరుడి అభిప్రాయం ముఖ్యమైనది. ప్రగతిశీల, సమ్మిళిత, సంపన్న తెలంగాణ కోసం ఈరోజే పౌర సర్వేలో పాల్గొని, మీ ఆలోచనలను పంచుకోండి’’ అని తెలిపింది. ఇందులో పాల్గొనడానికి నవంబర్ 1 చివరి తేదీగా వెల్లడించింది.
Read Also: బాలికల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. అటెండర్‌పై వేటు

