ప్రభుత్వానికి హైకోర్టు అడ్వ‌కేట్స్‌ అసోసియేష‌న్ కీలక విజ్ఞప్తి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కోర్టులు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వ‌కేట్స్ అంద‌రికీ ఆరోగ్య బీమా పథకాన్ని క‌ల్పించాల‌ని కొత్తగా ఎన్నికైన హైకోర్టు న్యాయవాదుల సంఘం (High Court Advocates Association) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు న్యాయ కార్యదర్శి పాపిరెడ్డికి ఒక వినతిపత్రాన్ని ఆదివారం సమర్పించారు. 2019 తర్వాత చేరి ప్రస్తుతం ఈ పథకం పరిధిలోకి రాని వారితో సహా, న్యాయవాదులందరికీ ఆరోగ్య బీమా ప్రయోజనాలను అందించాలని కోరారు. పేద‌లు, అన్యాయానికి గురైన ప‌క్షాల‌కు సేవ చేసే న్యాయ‌ వ్యవస్థలో న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తారని గుర్తు చేశారు. అటువంటి న్యాయ‌వాదుల‌కు ఆరోగ్య భద్రత విషయంలో ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక చొర‌వ అవ‌స‌ర‌మ‌ని అన్నారు.

ప్ర‌స్తుతం ప్రాక్టీసు చేస్తున్న‌ యువ న్యాయవాదులకు సంక్షేమ మద్దతు అవసరమని న్యాయవాద అసోసియేష‌న్ పేర్కొంది. ప్రాక్టీస్ ప్రారంభ సంవత్సరాల్లో జూనియర్ న్యాయవాదులకు మద్దతుగా స్టైఫండ్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో అసోసియేష‌న్ కోరింది. దాంతోపాటు, తెలంగాణ హైకోర్టు అసోసియేష‌న్ కు రావలసిన పెండింగ్ గ్రాంట్లను వీలైనంత త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, న్యాయవాద వృత్తికి సంక్షేమ ఆధారిత నిర్ణయాలు తీసుకుంటుందని అడ్వ‌కేట్ అసోసియేష‌న్ నాయ‌కులు అభిప్రాయపడ్డారు.

Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>