కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు యుద్ధం చేయాలని.. దానికి తాను అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. జగన్ 2.O లో కార్యకర్తే నెంబర్ వన్ అని జగన్ స్పష్టం చేశారు. ‘అన్యాయం చేస్తున్న పోలీసు వాళ్లందరికీ సినిమా ఎలా చూపించాలో మనం చూపిస్తాం’ అని వైసీపీ చీఫ్ చెప్పుకొచ్చారు.
అన్యాయం చేసే పోలీసులను గుర్తుంచుకుని వారి పేర్లను వెంటనే డిజిటల్ లైబ్రరీలోకి ఎక్కించాలని కార్యకర్తలకు జగన్ సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని లెక్కలూ తీస్తాం అని ఆయన (YS Jagan) హెచ్చరించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాలను మించిన వాళ్లు లేరని ఆరోపించారు. లింగులుటుకులు అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కరువు ఉంటే ప్రజలంతా సంతోషంగా కేరింతలు కొడుతున్నారని ప్రచారం చేస్తున్నాయని పలు మీడియా సంస్థలపై మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు.
Also Read : సాయికృష్ణ కేసు విచారణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

