కలం వెబ్ డెస్క్ : ఏపీలో మెడికల్ కాలేజీలు(Medical Colleges) ప్రైవేటుకు అప్పగించడం పెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ఆరోపించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని(PPP model) వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సేకరించిన కోటి సంతకాల ప్రతుల వాహనాలను గురువారం వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. నేడు వైయస్ జగన్ పీపీపీ విధానంపై గవర్నర్‌కు ప్రజల అభిప్రాయాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ ముఖ్య నేతలతో తాడేపల్లిలో సమావేశమై మాట్లాడారు.
మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పగించడమే పెద్ద స్కామ్ అంటే మరో రెండేళ్లు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడమేంటని జగన్(YS jagan) ప్రశ్నించారు. ఇలా మరో రూ.120 కోట్ల దోపిడీకి తెరలేపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి 4 లక్షల 11 వేల సంతకాలు సేకరించడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ తొలగించారని, సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను దారుణంగా మోసం చేశారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటే దోపిడీకి అనుమతించడమేనని, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని చెప్పారు.
Read Also: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డు
Follow Us On: X(Twitter)


